రైతుల తరఫున పవన్ కల్యాణ్ పోరాటం: ప్రణాళిక సిద్ధం చేసేపనిలో జనసేన

by Seetharam |   ( Updated:2023-10-17 12:52:15.0  )
రైతుల తరఫున పవన్ కల్యాణ్ పోరాటం: ప్రణాళిక సిద్ధం చేసేపనిలో జనసేన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణ, జనసేన - తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇందుకు సంబంధించి పీఏసీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో చర్చించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణా పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం చర్చకు వచ్చింది. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమంగాపెడుతున్న కేసులు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed