- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Janasena: చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
దిశ, మచిలీపట్నం: ఆఖరి నిమిషంలో జనసేన అభ్యర్థుల్లో మార్పులు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా మచిలీపట్నం బరిలో మొదటి నుంచి బాలశౌరి ఉంటారని భావించారు. అయితే, ఆఖరి నిమిషంలో పవన్ నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలశౌరిని అవనిగడ్డ నుంచి అసెంబ్లీ బరిలో దించనున్నారని ప్రచారం జరుగుతోంది.
తాజా మార్పులను పవన్ కళ్యాణ్ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.అయితే కృష్ణా జిల్లాలో జనసేన అభ్యర్థులకు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మొదటి నుంచి బందరు పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లేనని అంతా భావించారు.
జనసేన ఇప్పటికే ఒక ఎంపీ, 18మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే మచిలీపట్నం స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టిన జనసేనాని.. మచిలీపట్నం సీటు తన అన్న నాగబాబుకు, అవనిగడ్డకు బాలశౌరి పేరుని పరిశీలిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం.