Pawan Kalyan: వ్యక్తిగత గేమ్స్ ఆడొద్దు.. కూటమి నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-04 09:54:59.0  )
Pawan Kalyan: వ్యక్తిగత గేమ్స్ ఆడొద్దు.. కూటమి నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కూటమి పార్టీల నేతలు వ్యక్తిగత గేమ్స్ ఆడొద్దని హెచ్చరించారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గం(Pithapuram Constituency)లో పవన్ కల్యా‌ణ్‌(Pawan Kalyan) పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలని మండిపడ్డారు. అత్యాచార నిందితుల అరెస్ట్‌కు కులం అడ్డువస్తోందా? అని ప్రశ్నించారు. క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోందని అడిగారు. అధికారులకు, ఎస్పీలకు చెబుతున్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతలు(Law And Order) చాలా కీలకమైనవి అని అన్నారు. అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత (Home Minister Anitha) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ఎందుకు వదిలేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి మహిళలపై అత్యాచారం చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టే ఆ పరిణామాలు ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి ముఖ్యమంత్రి మాట్లాడలేదని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన నేరాలు కూడా ఇప్పుడు వారసత్వంగా వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వం అలసత్వం కూడా ఇప్పుడు వారసత్వంగా వచ్చిందని వ్యాఖ్యానించారు.

Read More : అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలి.. పవన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story