'వైసీపీ నేతల అవినీతిపై ఫిర్యాదుకు యాప్!'..పవన్ కల్యాణ్ సెటైర్లు

by Manoj |   ( Updated:2022-06-06 10:52:50.0  )
Pawan Kalyan
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో అవినీతిని రూపు మాపేందుకు ఏసీబీ ఇటీవల 14400 మెుబైల్ యాప్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అయితే ఈ యాప్ ప్రారంభించినప్పటి నుంచి విపక్షాలు సీఎం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నాయి. అవినీతి పుత్రుడు అవినీతిని అరికడతాడంట అంటూ సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ యాప్‌పై సెటైర్లు వేసిన జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి సెటైర్ వేశారు.

మరి వైసీపీ పాలకుల అవినీతి గురించి, వారి ఎమ్మెల్యేల దోపిడీ, దౌర్జన్యాల గురించి ఫిర్యాదు చేయాలంటే ప్రజలు ఏ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. 'ఏసీబీ 14400' మొబైల్ యాప్.. '' అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. అవినీతి నిరోధానికి ఇదో విప్లవాత్మక మార్పు. అవినీతి లేని పాలన అందించడమే మా లక్ష్యం'' అని #వైఎస్‌జగన్ అన్నారు అంటూ ఓ మీడియా చేసిన పోస్ట్‌ను ట్వీట్ చేస్తూ తన అభిప్రాయాన్ని పవన్ తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed