పబ్లిక్‌గా ఆయనతో అడిగి మరీ ఫొటో దిగిన పవన్ కల్యాణ్ (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-23 14:29:57.0  )
పబ్లిక్‌గా ఆయనతో అడిగి మరీ ఫొటో దిగిన పవన్ కల్యాణ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన్ను ఒకసారి కలిస్తే చాలు, ఒకసారి మాట్లాడితే చాలు, ఒకసారి ఫొటో దిగితే చాలు అని రోజూ ఎంతో మంది ఆయన ఇంటి ఎదుట పడిగాపులు కాస్తుంటారు. అలాంటి పవన్ కల్యాణ్ అడిగి మరీ ఓ రైతుతో ఫొటో దిగారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు మండలం మైసూరావారి పల్లెలో జరిగిన గ్రామ సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి 10 సెంట్ల భూమిని దానం చేసిన కారుమంచి నారాయణ అనే రైతుతో పబ్లిక్‌గా అడిగి మరీ ఫొటో దిగారు. రాష్ట్ర అభివృద్ధికి బాధ్యతగా సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. పదవి తమకు అలంకారం కాదని.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక కూలీ లాగా పనిచేస్తామని అన్నారు. పంచాయతీ భవనానికి సొంత భూమి ఉండాలని.. కబ్జా చేస్తే సహంచబోమని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే అది వృథా ప్రయాసే అని అన్నారు.

Advertisement

Next Story