"కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను" అంటూ మంత్రిగా జనసేనాని ప్రమాణ స్వీకారం

by Mahesh |   ( Updated:2024-06-12 06:57:40.0  )
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా జనసేనాని ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ కల్యాణ్ కు తగిన ఫలితం దక్కింది. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో గెలిచిన జనసేనకు చంద్రబాబు కేబినెట్ లో జనసేన కు మూడు మంత్రి పదవులు వచ్చాయి. ఈ రోజు కేసరపల్లిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. "కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను" అనగానే సభ ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. దాదాపు 10 సంవత్సరాల పాటు కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని.. ఇన్ని సంవత్సరాలు వేచి చూసిన అభిమానుల కల నెరవేరిన వేళ పవన్ ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు ఆనందంలో మునిగి పోయారు.

Read More: కోరి తెచ్చుకున్న కష్టాల్లో సూపర్ సక్సెస్.. ఆదర్శంగా పవన్ కల్యాణ్ ప్రస్థానం


Advertisement

Next Story