- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: నాకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యం: పవన్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తనకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని మైసూరవారిపల్లి గ్రామ సభకు హాజరయ్యారు. ముందుగా ఆయన గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటికి 75 శాతం గ్రామాల్లో వైసీపికి చెందిన వారే సర్పంచ్‌లు కొనసాగుతున్నారని అన్నారు. పల్లెల అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి అలాంటి తారతమ్యాలు లేవని తేల్చి చెప్పారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన లీడర్లే జాతీయ స్థాయికి ఎదుగుతారని గుర్తు చేశారు. రాజకీయలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యమని అన్నారు. గ్రామ స్థాయి నంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అధికారి రాష్ట్రాభివృద్ధి కోసం బాధ్యతగా పని చేయాలని పిలుపునిచ్చారు. స్వర్ణ పంచాయతీల ఏర్పాటే తమ ముందు ఉన్న లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే తన దృష్టిలో సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని అన్నారు. తనకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు.