- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: టీడీపీ, బీజేపీలతో పొత్తులపై పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశానికి పవన్ హాజరై ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార వైసీపీ పార్టీని ఓడించేందుకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మరికొన్ని పార్టీలతో అలయెన్స్‌లు ఉంటాయని పవన్ స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తాయని దీమా వ్యక్తం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఏం చేయడానికైనా సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు.
అంతేకానీ త్రిముఖ పోటీలో బలికావడానికి సిద్ధంగా లేనని పవన్ చెప్పారు. ఏ పార్టీపై తనకు ప్రేమ, ద్వేషం లేదని.. కేవలం రాజకీయ వ్యూహాం మాత్రమేనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని పవన్ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పొత్తులను తక్కువ అంచనా వేయవద్దని పవన్ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించి తీరుతామన్నారు. ఇక, సీఎం పోస్ట్ గురించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన బలమెన మెజార్టీతో గెలవాలని.. ఆ తర్వాత సీఎం సీటు గురించి మాట్లాడుదామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
RGV: ఫ్యాన్స్‌ను వెన్నుపోటు పొడిచి చంపేశారు..పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్