Breaking: ఉద్యోగమా..? ఊడిగమా..?జగనే చెప్పాలి.. పవన్ కళ్యాణ్

by Indraja |
Breaking: ఉద్యోగమా..? ఊడిగమా..?జగనే చెప్పాలి.. పవన్ కళ్యాణ్
X

దిశ డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తికి ముగ్గురు కూతుర్లు ఉండగా వాళ్లలో పెద్ద అమ్మాయి పీజీ, రెండవ అమ్మాయి సివిల్, మూడో అమ్మాయి డిగ్రీ చదివి ఉతీర్ణులై పట్టాలు పొందినా ఉద్యోగాలు మాత్రం రాలేదని.. ఆ సమయంలో వైసీపీ తన ముగ్గురు కూతుర్లకు వాలంటరీ పోస్ట్లు ఇచ్చింది తెలిపారు.

ఇక ఆ వ్యక్తి మాటలపై స్పందించిన పవన్ కళ్యాణ్ వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ/ 5200 జీతంతో ఎందుకు యువతను గ్రామాలకే కట్టిపడేస్తున్నారు అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 33 వేల గ్రామాలు.. ప్రతి గ్రామంలో పది మందిని చొప్పున కట్టిపడేస్తే వాళ్ళల్లో ఎంతమంది బలమైన వ్యక్తులు ఉన్నారో ఎవరికీ తెలుసు.. వాళ్ళల్లో ఓ స్టార్టప్ చేసేవాళ్ళు ఉన్నారేమో.. అలానే సైంటిస్ట్ కాగలిగిన వ్యక్తి అక్కడే ఆగిపోయారేమో.. పదిమందికి ఉపాధి కల్పించే వ్యాపారస్తులు ఉన్నారేమో.. లేక ఓ చిన్న ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నారేమో మనకి తెలీదు అని పేర్కొన్నారు.

యువతలో ఉన్న సామర్ధ్యాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. డిగ్రీలు, పేజీలు చేసిన యువతకు వాలంటరీ జాబ్ పేరుతో నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తూ వాళ్ళతో జగన్ ఊడిగం చేయించుకుంటున్నారని ఆరోపించారు. డిగ్రీ చదువుకున్న వాళ్ళను ఐదు వేలకు పని చేయమంటున్నారంటే అది ఉద్యోగమా.. లేక ఊడిగమా..? మీరే ఆలోచించండి అని యువతకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed