PAWAN KALYAN: ప్రభుత్వ సభలో OG నినాదాలు.. సినిమా వేరు రాజకీయాలు వేరంటూ పవన్ సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-08-24 03:28:16.0  )
PAWAN KALYAN: ప్రభుత్వ సభలో OG నినాదాలు.. సినిమా వేరు రాజకీయాలు వేరంటూ పవన్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పలు శాఖలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ప్రభుత్వ సభలో ఆయన మాట్లాడుతూ ఉండగా అభిమానులు ఓజి, ఓజి అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ స్పీచ్ మధ్యలో ఆపేసి.. సినిమాని సినిమా గానే చూడండి. సినిమా వేరు రాజకీయాలు వేరు. సినిమా అనేది ఒక కల, మన జీవితంలో సాధించలేనివి చూపేది సినిమా. ఒకడు ఓడిపోయి మళ్లీ గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పడానికి సినిమాలో అయితే రెండున్నర గంటలు చాలు. కానీ, నిజ జీవితం అలా ఉండదు కదా తిట్లు తినాలి తన్నులు తినాలి, అసలు ఉంటామో లేదో తెలియదు.

అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి. కేసులు పెడతారు, పెట్టించుకోవాలి, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. ఇన్ని కష్టాల మధ్యలో ఒక దశాబ్దం పడుతుంది. దశాబ్దాన్ని రెండున్నర గంటల్లో కుదించి సినిమా చేసేయొచ్చు. అందుకే నా సినిమాలనే కాదు ఏ సినిమా అయినా మీరు నిజ జీవితాన్ని వేరు చేసి చూడండి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం. దేశభక్తి దేశం కోసం. మీరు ఆ విషయం మర్చిపోవద్దు. మీరు ఓజి, ఓజి అంటుంటే నాకు సంతోషమే, మీరు చూస్తే నాకు డబ్బులు కూడా వస్తాయి కానీ నాకు చాలా స్పష్టత ఉంది. సినిమాకి రాజకీయానికి నేను తీసుకున్న బాధ్యతకు చాలా స్పష్టత ఉంది అంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story