Breaking: పల్లె పండుగలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-10-14 07:37:41.0  )
Breaking: పల్లె పండుగలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెడ్ డెస్క్: రాష్ట్ర ప్రజలు బాగుండాలని, యువతకు ఉద్యోగాలు రావాలని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని, దెబ్బలు తిన్నామని, చివరకు నిలబడ్డామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan) తెలిపారు. కంకిపాడులో ‘పల్లెపండుగ’(Village Festival) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా బలమని ఆయన పేర్కొన్నారు. నాయకుడి అనుభవాన్ని ఉపయోగించుకోకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాయని చెప్పారు. అందుకే కలిసి పోటీ చేశామని తెలిపారు. గత పాలనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. గ్రామ సభలు పెట్టలేదని, కానీ నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులకు లెక్కలు తెలియవన్నారు.

ఆగస్టు 23న రాష్ట్రంలో 13వేల326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించామన్నారు. గ్రామ సభ నిర్ణయాలతోనే పల్లెల్లో పనులు చేస్తున్నామని తెలిపారు. గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం ఈజీ కాదని చెప్పారు. పాలనలో తనకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) స్ఫూర్తి అని, పారదర్శకతతో రాష్ట్రాన్ని పాలిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అధికారులు కూడా అలాగే ఉండాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది లంచాల ప్రభుత్వం కాదని, మంచి పాలన అందిస్తామని చెప్పారు. 4 వేల 500 కోట్ల నిధులతో 30 వేలు పనులు చేస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed