మహిళా దినోత్సవాన పవన్ కల్యాణ్ కీలక హామీ

by GSrikanth |
మహిళా దినోత్సవాన పవన్ కల్యాణ్ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ఈ సదర్భంగా మహిళలకు పవన్ కల్యాణ్ కీలక హామీ ఇచ్చారు. మహిళల రక్షణ, సంక్షేమం తమ బాధ్యతగా తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నా అక్కలు, చెల్లెలు అంటూ మాటలతో సరిపెట్టబోమని చెప్పారు.

విద్య, ఉద్యోగాల్లో రాణించేలా మహిళలకు వృత్తి నైపుణ్యాలు పెంపొందిస్తామని హామీ ఇచ్చారు. ఏ సమాజం, ఏ సంస్కృతి, ఏ జాతి స్త్రీకి సమున్నత స్థానం కల్పిస్తుందో ఆ సమాజం, ఆ సంస్కృతి, ఆ జాతి అభివృద్ధి పథంలో ముందుంటుంది. ఏ సమాజం, ఏ సంస్కృతి ఏ జాతి అయితే ఈ విషయంలో వెనుకడుగు వేస్తుందో ఆ జాతి అభివృద్ధిని సాధించలేక ప్రగతిపథంలో వెనుకబడే ఉంటుంది. జనాభాలో సగభాగమైన వారికి ఉత్పాదక శక్తిని వినియోగించే అవకాశం కల్పిస్తామని అన్నారు.

Advertisement

Next Story