- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నేను ప్రజల గురించి ఆలోచిస్తుంటే.. త్రివిక్రమ్ నా గురించి ఆలోచించేవాడు’ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాన్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అందులో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ డూపర్ హిట్ కాగా, అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, జల్సా సినిమా నుంచి వీరి మధ్య బాండింగ్ పెరిగింది. ఇద్దరి ఆలోచనా కోణాలు ఒకేలా ఉండటం.. పుస్తకాల ప్రియులు కావడం స్నేహానికి దారి తీశాయి. అయితే, తాజాగా.. మరోసారి త్రివిక్రమ్‌తో స్నేహంపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నేను ప్రజల గురించి ఆలోచిస్తుంటే త్రివిక్రమ్ నా గురించి ఆలోచించేవారు. నా దగ్గర ఉన్న డబ్బులు జనాలకు ఇస్తుంటే.. ఆయన నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండేలా సినిమాలు తెచ్చిపెట్టే పనులు చేసేవాడు. అసలు త్రివిక్రమ్‌కు నేను రాజకీయాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదు. చెప్పి చెప్పి విసుగుచెంది ఎలాగైనా నన్ను మార్చాలని జల్సా సినిమాలో కొన్ని డైలాగ్స్ రాశాడు. కానీ, ఆ డైలాగ్స్‌తో నాకు సమాజంపైనా గౌరవం మరింత పెరిగింది. నా బాగోగులు ఆలోచించే త్రివిక్రమ్ లాంటి మిత్రుడు నాకు దొరకడం అదృష్టం’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Read More..
టీడీపీ జాబితాలో ఈ సారి క్లాస్ - మాస్.. జోష్‌లో టీడీపీ శ్రేణులు