కాపులపై విష ప్రచారం జరుగుతోంది: Pawan Kalyan

by srinivas |   ( Updated:2023-03-12 11:24:37.0  )
కాపులపై విష ప్రచారం జరుగుతోంది: Pawan Kalyan
X

దిశ, వెబ్ డెస్క్: కాపులు అధికారంలోకి వస్తే బీసీలు, దళితులను తొక్కేస్తారనే విష ప్రచారం జరుగుతోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కాపు సంక్షేమ సేన ప్రజాప్రతినిధులతో భేటీ అయిన పవన్ కల్యాణ్.. కులాలను వాడుకునే వాళ్లు ఉన్నారు తప్ప.. పట్టించుకునే నాయకులు లేరన్నారు. కాపులకు సంఖ్యా బలం ఉందని, ఇంకా రిజర్వేషన్ల కోసం దేహీ అనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కాపులంతా ఒక్కటిగా ఉంటే అధికారం దానికదే వస్తుందని చెప్పారు. కొంతమంది కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, కాపుల్లో సంఖ్యా బలం ఉందని... కానీ ఐక్యత లేదని పవన్ పేర్కొన్నారు.

కాపులు, బీసీల మధ్య చిచ్చుకు కుట్ర

కాపులు, బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాపులు, బీసీలు సంఘాలుగా విడిపోయాయని చెప్పారు. అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు. ఒక కులం తరపున తాను ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. కాపులను ఎదగడమంటే మిగిలిన కులాలు తగ్గడం కాదన్నారు. జనసేనను నమ్మాలని.. ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించమని పవన్ తెలిపారు. దేశం తనకు మానవత్వం నేర్పిందని పవన్ స్పష్టం చేశారు. కుళ్లు, కుట్రలు కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదన్నారు. తాను మెత్తటి మనిషిని కాదని పవన్ హెచ్చరించారు. తాను ఓటమి తెలియని వ్యక్తిని కాదని పవన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed