స్పీడ్ పెంచిన పవన్ కల్యాణ్ : మంగళగిరికి జనసేనాని

by Seetharam |   ( Updated:2023-12-01 08:08:53.0  )
స్పీడ్ పెంచిన పవన్ కల్యాణ్ : మంగళగిరికి జనసేనాని
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు కీలకంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం నుంచి దించేందుకు అటు టీడీపీ ఇటు జనసేన వ్యూహరచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తుండగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ జనసేన పార్టీ విస్తృత సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్‌కు గన్నవరం ఎయిర్ పోర్టులో జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు టీడీపీ శ్రేణులు సైతం పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కల్యాణ్ బయలుదేరారు.మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వీరమహిళలు ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ వెంట పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం ఉన్నారు. ఇకపోతే మరికాసేపట్లో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed