‘ఎక్కడ తగ్గాలో..ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్’..సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-06-22 08:37:37.0  )
‘ఎక్కడ తగ్గాలో..ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్’..సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నిన్న ఎమ్మెల్యేగా ప్రమాణం కూడా చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఎన్నికల సమయంలో జనసేనకు ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేసిన వైసీపీకి జనసేన బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అనాడు టీడీపీకి 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు.

రెండు రోజు(శనివారం) శాసనసభ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. నేడు కూటమికి 164 సీట్లు వచ్చాయి..ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్న వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 21కి 21 స్థానాల్లో గెలిచి పవన్ గట్టి సమాధానం ఇచ్చారన్నారు. ‘ఎక్కడ తగ్గాలో..ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్’ అని కొనియాడారు. ఇక ప్రజాజీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని సీఎం సభ్యులకు చెప్పారు. అత్యున్నత, గౌరవప్రదమైన సభగా దీన్ని తీర్చిదిద్దాలని సూచించారు.

Advertisement

Next Story
null