AP Assembly:పంచాయతీ రాజ్ శాఖపై శ్వేతపత్రం..అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన

by Jakkula Mamatha |   ( Updated:2024-07-26 08:21:16.0  )
AP Assembly:పంచాయతీ రాజ్ శాఖపై శ్వేతపత్రం..అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ(శుక్రవారం) జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ నిధులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ హయాంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీ నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాధానం పై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం అని తెలియజేశారు. 2019-2024 మధ్య కాలంలో మొత్తం రూ.7586 కోట్లు పంచాయతీల ఖాతాల్లో పడ్డాయని అన్నారు. అందులో రూ.2285 కోట్లు కరెంట్ ఛార్జీలు కోసం డిస్కంలకు ఆర్థిక శాఖ పంపించింది. దీనికి ఎవరి అనుమతి తీసుకోలేదు. పంచాయతీరాజ్ అవకతవకలపై సుదీర్ఘ చర్చ జరగాలి అని అసెంబ్లీలో పవన్ ప్రసంగించారు.

Advertisement

Next Story

Most Viewed