- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు దారుణం: సోము వీర్రాజు
దిశ, ఏపీ బ్యూరో : ప్రభుత్వం వెంటనే స్పందించి హిందూ మనోభావాలను దెబ్బతీసే గొడ్రాలికొండ దగ్గర ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో వెలసిన గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి దేవాలయం దగ్గర అక్రమంగా ఏర్పాటుచేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలన్నారు. ఈ ప్రాంతం హిందువులకు తిరుమలనాథ స్వామి దేవాలయం పరమ పవిత్రమైన ప్రదేశం అని చెప్పుకొచ్చారు. తమ కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా స్వామివారిని భావిస్తుంటారు. అనేక శతాబ్దాలుగా సంతానం కలగని దంపతులు ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి అనంతరం అక్కడ వెలసిన తిరుమల స్వామి ఆ దేవాలయంలో ఉసిరి చెట్టుకు తమ మొక్కులు కట్టి స్వామివారిని ప్రార్ధించి భక్తిప్రపత్తులతో చేసిన భక్తులకు అనేక వేల మందికి సంతాన భాగ్యం కలిగింది అని చెప్పుకొచ్చారు.
'అభివృద్ధి చెందుతున్న ఈ దేవాలయం గిరి ప్రదక్షిణ చేసే ప్రదేశంలో ఈ మధ్య కాలంలో హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని దెబ్బతీసే విధంగా కొంతమంది అన్యమతస్తులు గొడ్రాలి కొండపై అన్యమత చిహ్నాలు ఏర్పాటు చేసి చర్చి నిర్మాణం చేస్తున్నారు. ఈ చర్య ఈ ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తో పాటు ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా సంస్కృతి దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నాయకత్వంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. చర్చి నిర్మాణం పనులు నిలిపివేయాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని' బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హెచ్చరించారు.