- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకెంత కాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు: పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దమ్ముంటే వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. ఆర్థిక పరిస్థితిపై బూటకపు ప్రకటనలు చేయడాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కట్టిపెట్టాలని సూచించారు. ఇంకెంత కాలం పిట్టకథలతో నెట్టుకొస్తారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వం పని తీరు అద్భుతంగా ఉందని.. తమకు తాము ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని విమర్శించారు.
బుగ్గన వ్యవహారం చూస్తే తమ కాళ్ళకు తాము నమస్కారం చేసుకొని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి కున్నట్లుగా ఉందని పయ్యావుల ఎద్దేవా చేశారు. చాణుక్యుడు సైతం నివ్వెరపోయేలా బుగ్గన లెక్కలు ఉన్నాయి. దొంగ లెక్కలు మాని వాస్తవాలను ప్రజల ముందు ఉంచండి. ఎఫ్ ఆర్ బి ఎం కు రెండు రెట్లు మించి రాష్ట్ర అప్పులు ఉన్నాయి అని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం, మూలధన వ్యయం ఎంతో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. పథకాలకు పెడుతున్న ఖర్చు కన్నా.. వాటి ప్రచారం ప్రకటనల కోసం పెడుతున్న ఖర్చులే ఎక్కువని పయ్యావుల ఆరోపించారు.