నేను ఎక్కడ పోటీ చేయాలో మా పార్టీ అధినేత చెబుతారు.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

by Shiva |
నేను ఎక్కడ పోటీ చేయాలో మా పార్టీ అధినేత చెబుతారు.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే ఎన్నికల్లో తాను ఒక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని టీడీపీ అధినేతే నిర్ణయిస్తారని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంట శ్రీనివాస రావు అన్నారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ఇక రోజులు లెక్కబెట్టుకోవాలని, ఆ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని ఫైర్ అయ్యారు. తాను ఎక్కడ పోటీ చేయాలో టీడీపీ అధినేతే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

Advertisement

Next Story