- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా కుటుంబాన్ని వేధిస్తున్నారు : పోలీసులకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో : కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సోషల్ మీడియా వేదికగా తమను వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గురువారం గన్నవరం పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తనను, తన కుటుంబాన్ని అసభ్యకరంగా దూషిస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కెనడాలో చదువుతున్న యనమదల సందీప్ అనే వ్యక్తి తమను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు యనమదల సందీప్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వల్లభననేని వంశీమోహన్ ఫిర్యాదులో కోరారు. ఇకపోతే వల్లభనేని వంశీమోహన్ 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీమోహన్ వైసీపీకి అనుమబంధంగా మారిపోయారు.