- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇక నుంచి నా రాజకీయ పయనం అక్కడి నుంచే: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తప్ప మరో వ్యాపకం లేదని వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఏ వ్యాపారాలు, వ్యసనాలు లేవని చెప్పారు. వ్యాపారాలను కాపాడుకోవాలని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఆ ఆలోచనే తనకు లేదని చెప్పారు. ప్రజా సేవ చేయాలనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు తాను వచ్చినట్లు చెప్పారు. చంద్రగిరిని ఏ విధంగా అభివృద్ధి చేశానో ఒంగోలును కూడా అదే విధంగా డెవలప్ మెంట్ చేస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇక నుంచి తన రాజకీయ జీవితం ఒంగోలు పార్లమెంట్ నుంచేనని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో సీఎం జగన్ తనను ఇక్కడకు పంపారని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలందరూ తనకు మనస్ఫూర్తిగా సహకరించాలని చెవిరెడ్డి కోరారు. తాను నియోజకవర్గం మారడంపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. చంద్రగిరిలో పుట్టిన చంద్రబాబు, లోకేశ్ అక్కడ పోటీ చేయకుండా కుప్పం, మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు.
Read More..