ఏ పార్టీలోకి వెళ్లినా తప్పించుకోలేరు.. బాలినేనికి ఎమ్మెల్యే జనార్ధన్ స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2024-09-22 10:41:04.0  )
ఏ పార్టీలోకి వెళ్లినా తప్పించుకోలేరు.. బాలినేనికి ఎమ్మెల్యే జనార్ధన్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి(Ongole Former Mla Balineni SrinivasulaReddy) జనసేన పార్టీలో చేరబోతున్న విషయం తెలిసిందే. అయితే బాలినేని వ్యవహారంపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ (Mla Janardhan) స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ (Tdp) కార్యకర్తలను బాలినేని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమంగా కేసులు పెట్టించారని మండిపడ్డారు. తనపై కూడా 32 కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు (Chandrababu)ను సైతం బాలినేని తిట్టారని జనార్థన్ తెలిపారు.

‘‘అధికారం పోయి వందరోజులు కూడా కాలేదు. అప్పుడే బాలినేని వైసీపీ (Ycp)కి గుడ్ బై చెబుతున్నారు. ప్రకాశం జిల్లా (Prakasam District)ను బాలినేని సర్వ నాశనం చేశారు. ఇంకా జనసేన పార్టీ(Janasena Party)లో చేరకముందే టీడీపీ శ్రేణులను బాలినేని బెదిరిస్తున్నారు. బాలినేని ఏ పార్టీలో చేరినా కేసులు నుంచి తప్పించుకోలేరు.’’ అని ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed