కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తులు

by M.Rajitha |
కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం బ్యారేజి గేట్ల మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన వరద ఉద్ధృతికి ఐదు బోట్లు బ్యారేజీలోని 67,68,69 గేట్లను బలంగా తాకాయి. ఇందులో 69వ గేటు పూర్తిగా దెబ్బతిన్నది. కాగా వరద ప్రవాహం కాస్త తగ్గిన క్రమంలో గేట్ల మరమ్మత్తుల బుధవారం మొదలు పెట్టారు అధికారులు. తుంగభద్ర గేటు పనులు పర్యవేక్షించిన కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలోనే ఈ గేట్ల పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. ఇక గేట్లు దెబ్బతినడానికి కారణమైన పడవలను తొలగించారు. 69వ గేటు కౌంటర్ వెయిట్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. మరమ్మతులు పూర్తవడానికి వారం రోజుల సమయం పడుతుందని అధికారులు తెలియ జేశారు.

Next Story

Most Viewed