వైకామ పార్టీకి ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా? : బండారు అరెస్ట్‌పై నారా లోకేశ్

by Seetharam |   ( Updated:2023-10-03 15:15:47.0  )
వైకామ పార్టీకి ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా? : బండారు అరెస్ట్‌పై నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైకామ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు,నేతలంతా కూసే రోత బూతు కూతలపై ఎన్ని వేల కేసులు నమోదు చేయాలని పోలీసులు? అని ప్రశ్నించారు. బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని మాత్రం టెర్రరిస్టులా అరెస్ట్ చేశారు అని మండిపడ్డారు. వైకామ పార్టీకి ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా? ఇదేం అరాచక పాలన అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. మరోవైపు బండారు సత్యనారాయణ మూర్తికి నారా లోకేశ్ సోమవారం రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులకు ఇబ్బందులు తప్పవని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ తొత్తుల్లా వ్యవహరించే ప్రతీ అధికారి వివరాలు నమోదు చేయాలని లోకేశ్ ఆదేశించారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా కక్ష సాధింపులకు దిగటం కొందరు పోలీసులకు పరిపాటిగా మారిందని.. బూతుల మంత్రులపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని లోకేశ్ నిలదీశారు. అయితే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పోరాటం ఆపేది లేదని లోకేశ్‌కు మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తెలియజేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed