Breaking: పెన్షన్ కోసం వెళ్లి మరో వృద్ధుడు మృతి

by srinivas |   ( Updated:2024-04-05 12:41:11.0  )
Breaking: పెన్షన్ కోసం వెళ్లి మరో వృద్ధుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పెన్షన్ కోసం వెళ్లి వృద్ధులు మృతి చెందుతున్నారు. ఇన్నాళ్లు ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న వీళ్లు.. ఇప్పుడు వార్డు సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అక్కడ సౌకర్యాల లేక అల్లాడిపోతున్నారు. ఎండ, ఉక్కపోత తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటికే పలువురు వృద్ధులు మృతి చెందారు. ఈ ఘటన మర్చిపోకముందే మరో వృద్ధుడి ప్రాణాలు గాల్లో కలిచిపోయాయి. ఈ ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కందాడులో జరిగింది. పెన్షన్ కోసం వెళ్లి వెంకటరాజు మృతి శుక్రవారం చెందారు. ఎంతవేడిమితో సచివాలయం వద్ద ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వెంకటరాజును ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గంమధ్యలో వెంకటరాజు మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ కోసం వెంకటరాజు ప్రాణాలు పోగొట్టుకోవడంతో అధికార, ప్రతిపక్ష నాయకులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story