ప్రమాదకరంగా వంతెన..పట్టించుకోని అధికారులు

by Jakkula Mamatha |
ప్రమాదకరంగా వంతెన..పట్టించుకోని అధికారులు
X

దిశ, పల్నాడు:సత్తెనపల్లి నియోజకవర్గ పరిధి రాజుపాలెం మండలం అనుపాలెం పెద్ద కాలువ ప్రమాదాలకు నిలయంగా మారింది. గుంటూరు పిడుగురాళ్ల అంతరాష్ట్ర రహదారి దశాబ్దాల కాలంగా ఈ వంతెన మరమ్మతులకు నోచుకోలేదు. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది.పెద్ద పెద్ద లారీలు, బస్సులు కార్లు, ఆటోలు ద్విచక్ర వాహనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ వంతెనకు రెండు వైపులా ఉన్న సైడ్ వాల్స్ పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. స్థానికులు కర్రలతో తాత్కాలిక రక్షణ ఏర్పాటు చేశారు. కాల్వ పై ఉన్న రైలింగ్స్ ఊడిపోయి ప్రమాదకరంగా ఉంది.‌

వాహనదారులు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వాహనంతో సహా కాలువలో పడిపోవాల్సిందే. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అంటూ వాహనదారులు అధికారుల పై ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ రహదారి గుంటూరు నుంచి హైదరాబాద్ వరకు నిత్యం ప్రభుత్వ బస్సులు ప్రైవేటు బస్సులు, లారీలు, ఆటోలు స్కూల్ వ్యాను ద్విచక్ర వాహనదారులతో ప్రతినిత్యం రోడ్డు కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఇప్పటికైనా రహదారులు భవనాల శాఖ అధికారులు స్పందించి వంతెన మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed