- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెల్లూరు ఓటర్లు ఆ వైపేనా..?
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో నెల్లూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు చాలా మంది అయ్యారు. ఉమ్మడి, విభజిత రాష్ట్రంలో ఇక్కడి నాయకులు చక్రం తిప్పారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం జరిగే పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అటు ఓటర్లు సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కొవ్వూరు, ఆత్మకూరుతో పాటు కావలి సైతం ఉంది. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం ఉంటుంది. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగించింది. విభజన తర్వాత ఓ సారి టీడీపీ, మరోసారి వైసీపీకి చెందిన రెడ్లు ఆధిపత్యం చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదే అనవాయితీ కొనసాగే అవకాశం ఉంది. కానీ రిజల్ట్స్ వస్తేనే కచ్చితంగా చెప్పగలరు.
అయితే ఈ 10 నియోజవకర్గాల్లో కావలిలో 2,38,553 మంది ఓటర్లు ఉండగా ఆత్మకూరులో 2,15,401, కొవ్వూరులో 2,67,345, నెల్లూరు సిటీలో 2,39,497, నెల్లూరు రూరల్‌లో 2,80,888, సర్వేపల్లిలో 2,32,011, గూడూరులో 2,45,205, సూళ్లూరుపేట 2,42,610, వెంకటగిరి 2,43,582, ఉదయగిరి 2,41,677 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 8 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు. దీంతో మహిళ మద్దతు ఎక్కువగా ఏ పార్టీకి ఉంటుందో ఆయా అభ్యర్థులు గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఏం జరుగుతుందో జూన్ 4న విడుదల అవుతున్నాయి.. అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. మంచి నేతలను ఎన్నుకోవాలని కోరుకుందాం.
Read More..