AP News:చిన్న వెంకన్న ఆలయాన్ని చుట్టుముట్టిన ఆక్టోపస్

by Jakkula Mamatha |
AP News:చిన్న వెంకన్న ఆలయాన్ని చుట్టుముట్టిన ఆక్టోపస్
X

దిశ, ద్వారకాతిరుమల:ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆక్టోపస్ బలగాలు సోమవారం రాత్రి హడావుడి చేశాయి. ఆలయంలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో భక్తులను ఎలా రక్షించాలి, ఆలయ ఆస్తులను ఎలా కాపాడాలనే అంశం పై నిర్వహించిన మాక్ డ్రిల్ చేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఉగ్రవాదులు ముప్పేట దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి, అర్ధరాత్రి లేదా భక్తులు రద్దీగా ఉండే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఎలా తిప్పికొట్టాలి అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆక్టోపస్ బలగాలు ఆలయం ప్రాంగణంలో మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, ఆక్టోపస్ బలగాలతో పాటు, స్థానిక పోలీసులు సైతం ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు.

Advertisement

Next Story