- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా?
దిశ, యాచారం : మండల పరిధిలోని మల్కిస్ గూడా, మేడిపల్లి నక్కర్త, గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డు పూర్తిగా పాడైంది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఏండ్ల క్రితం నిర్మించిన రోడ్డు కావడంతో మేడిపల్లి గ్రామ సమీపాన ఉన్న కల్వర్టు దాటినాక బీటీ రోడ్డు పైన పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి కంకర రాళ్లు బయటపడటంతో ఆ రోడ్డు గుండా ప్రయాణాలు చేసే వాహనదారులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు. ఐదేళ్లుగా కనీస మరమ్మతులు చేయకపోవడంతో వర్షాకాలంలో మరింత అధ్వానంగా మారి ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. రాత్రి వేళల్లో గుంతలను తప్పించే క్రమంలో ప్రమాదాల బారిన పడుతూ, ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డుపైన ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు చేయాల్సి వస్తోందని వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆర్.అండ్.బి అధికారులు స్పందించి గుంతలుగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.