- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Gautham Adani: గౌతమ్ అదానీ ఖాతాలో మరో సిమెంట్ కంపెనీ.. రూ. 8100 కోట్లతో డీల్..!

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ(Gautham Adani)కి చెందిన అదానీ గ్రూప్(Adani Group) సిమెంట్ వ్యాపారంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అంబుజా సిమెంట్(Ambuja Cement), ఏసీసీ సిమెంట్స్(ACC Cements), పెన్నా సిమెంట్(Penna Cement) కంపెనీలను కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ తాజాగా మరో సిమెంట్ కంపెనీలో వాటా కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ సిమెంట్ కంపెనీ ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్(OCC)లో 48.8 శాతం షేర్లు దక్కించుకోనునట్లు స్వయంగా ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని అదానీ గ్రూప్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే సిమెంట్ వ్యాపార సామర్థ్యం పెంచుకోవడమే లక్ష్యంగా ఈ కొనుగోళ్లు చేపట్టనుంది. దాదాపు రూ. 8100 కోట్లు వెచ్చించి.. ఓరియెంట్ సిమెంట్(Orient Cement) సంస్థలో 46.8 శాతం వాటా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. ప్రమోటర్స్ నుంచి 37.9 శాతం, పబ్లిక్ నుంచి అదనంగా మరో 8.9 శాతం మేర కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. దీనికి అదనంగా మరో 26 శాతం వాటా కోసం.. ఆఫర్ ఫర్ సేల్‌కు వెళ్లేందుకు చూస్తోంది. 2025 నాటికి.. ఈ కొనుగోలుతో ప్రతి ఏటా ఉత్పత్తి సామర్థ్యం 100 మిలియన్ టన్నులకు చేరుతుందని అంబుజా సిమెంట్ డైరెక్టర్ కరణ్ అదానీ(Karan Adani) ధీమా వ్యక్తం చేశారు.