- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Komati Jayaram: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్
దిశ, ఎన్నారై: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ కోమటి జయరాం అన్నారు. ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమాన్ని మేరి ల్యాండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీనాథ్ రావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జయరాం కోమటి వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ.. 'సమాజంలో ప్రజల రూపంలో దేవుడిని చూసిన వ్యక్తి ఎన్టీఆర్. రాజకీయాల్లో పెత్తందారులకు కాకుండా చదువుకున్న వారికి, బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. దశదిశలా తెలుగువారి ఖ్యాతిని పెంచారు. ప్రజల హృదయాల్లో నందమూరి తారక రామారావు చిరస్థాయిగా నిలిచిపోయారు.' అని అన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ 'తెలుగువారి వాడి వేడి ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్. పేదలకు కూడు, గూడు కల్పించారు. బీసీలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. వెండితెరపై దేవుడు, రాజకీయ వేదికపై నాయకుడు, ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్' అని కొనియాడారు.
గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ 'విలువలతో కూడిన రాజకీయాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్. అక్రమ కేసులు, కక్షసాధింపులకే నేటి పాలకులు అధికారాన్ని వినియోగిస్తున్నారన్నారు తప్ప అభివృద్ధి పట్టడం లేదు. టీడీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు నడుంబిగించాలి.' అని పిలుపునిచ్చారు.
నరిశెట్టి ఇన్నయ్య మాట్లాడుతూ 'రాజకీయాలతో సంబంధం లేని ముఖ్యమంత్రి ఎన్టీఆర్. ఆయన సామాజిక సేవా దృక్పథంతో సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చిన సంఘసంస్కర్త.' అని అన్నారు. ప్రపంచంలో ఆంధ్రులను తిరుగులేని శక్తిగా మార్చడంలో ఎన్టీఆర్ నాటిన బీజాన్ని చంద్రబాబు మహావృక్షంగా మార్చారన్నారు.
జీడబ్ల్యూజీసీఎస్ మాజీ అధ్యక్షుడు జక్కంపూడి సుబ్బారాయుడు , రావులపల్లి రాజా మాట్లాడుతూ అమెరికాలో ఎన్టీఆర్ పర్యటన సందర్భంగా ఆయనతో కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నామన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
అనంతరం రాజశేఖర్ చెరుకూరి, నాగప్రసాద్ గనపనేని, శ్రీనివాస్ సామినేని, వెంకట్ కూకట్ల తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శివ నాగ మహేష్ నెలకుదిటి, రమేష్ నూతక్కి, జానకి రామ్ బోగినేని, కిషోర్ కంచర్ల, గోపీకృష్ణ అమిరినేని, గుండూరి యశ్వంత్, శివ నెల్లూరి తదితరులు పాల్గొన్నారు.