- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
NTR Bharosa: జోరుగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ.. రాష్ట్రంలో పండుగ వాతావరణం
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారులతో కలిసి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన పెన్షన్ ఒకటవ తేదీకి ముందే లబ్దిదారులకు అందజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం 64,61,485 లబ్ధిదారులకు రూ. 2729.86 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లబ్దిదారుల ఇంటి తలుపు తట్టి పించన్లు అందజేశారు. నెల ప్రారంభానికి ఒక రోజు ముందుగానే పించన్ల పంపిణీ జరుగుతుండటంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది.
విజయనగరం జిల్లా జియ్యన్న వలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెల్లవారుజామునే వెళ్లి ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేశారు. అలాగే పెట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఉదయం 6 గంటలకే పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం లబ్దిదారులకు ఉదయాన్నే పెన్షన్లు పంపిణీ చేశారు. వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో సైతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ముంపు ప్రాంతంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నడుము లోతు నీళ్లలో వెళ్లి పించన్ అందజేశారు. అలాగే ఆయా చోట్ల ముంపు ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు. ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని, పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని, టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 70 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తియినట్లు తెలుస్తోంది. పెన్షన్ల పంపిణీలో టాప్-3లో శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు ఉండగా.. చివరి స్థానంలో అల్లూరి జిల్లా నిలిచింది.