పార్టీ మారిన ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ

by Mahesh |   ( Updated:2024-03-02 10:31:52.0  )
పార్టీ మారిన ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్ లో ఇటీవల పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలకు సైతం మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. కానీ ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. తాజాగా శనివారం పార్టీ మారిన ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ మోషేన్ రాజు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న తుది విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, రామచంద్రయ్యకు శాసన మండలి నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఈ తుది విచారణకు హాజరుకాకుంటే తాము తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టంగా వెల్లడించారు. దీంతో వీరిపై కూడా అనర్హత వేటు తప్పదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read More..

డోన్‌ టీడీపీలో కోట్ల వర్సెస్ సుబ్బారెడ్డి.. పోటా పోటీ ప్రచారం

Advertisement

Next Story