పీకే కాదు కేకే.. పవన్‌ కల్యాణ్‌ కిరాయి కోటిగాడు: మంత్రి అంబటి రాంబాబు

by Seetharam |
పీకే కాదు కేకే.. పవన్‌ కల్యాణ్‌ కిరాయి కోటిగాడు: మంత్రి అంబటి రాంబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే అంటే పవన్ కల్యాణ్ కాదు అని కేకే అని ఆరోపించారు. కేకే అంటే కిరాయి కోటిగాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల ఖమ్మంలో తనపై కొందరు టీడీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నుంచి కిరాయి తీసుకుంటాడు కాబట్టే ఖండించడని అన్నారు. ప్రగల్భాలు పలికే పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడును ఏమైనా అంటే మాత్రం రోడ్డుమీదకు వచ్చి పడుకుంటాడని మండిపడ్డారు. గతంలోనూ ముద్రగడ పద్మనాభంపై దాడి జరిగినా పవన్ కల్యాణ్ ఖండించలేదని గుర్తు చేశారు. ఇకపోతే ఖమ్మంలో తనపై దాడి వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనపై జరిగిన దాడి యత్నం చిన్నదిగా చూడొద్దు. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. నన్ను భౌతికంగా తొలగించాలని గతంలోనే ఇక సమావేశంలో చెప్పారు. నా మీద దాడికి యత్నించిన వారిలో తొమ్మిది మందిని గుర్తించారు. వారిలో ఆరుగురుని అరెస్ట్‌ చేశారు. వారంతా ఒకే సామాజికి వర్గానికి చెందిన వారు’ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

వైసీపీలో ఉన్న కాపులు కాపులు కాదా? : అడపా శేషు


మరోవైపు కాపుల గౌరవాన్ని మంత్రి అంబటి రాంబాబు పెంచారు అని వైసీపీ నేత అడపా శేషు అన్నారు. కాపుల ఆరాధ్యదైవం వంగవీటి మోహన రంగాను టీడీపీ నేతలు అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. అలాంటి టీడీపీతో పవన్ కల్యాణ్ జతకట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో కాపులకు పెద్ద పీట వేయకూడదా? అని అడపా శేషు ప్రశ్నించారు. కాపులు ఓటర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీలో ఉన్న కాపులు..కాపులు కాదా?. కాపుల మీద దాడి చేస్తే పవన్ కల్యాణ్ మాట్లాడకుండా ఉన్నందుకు సిగ్గేయటం లేదా? అని అడపా శేషు విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed