ఏపీలోనే కాదు తెలంగాణలోనూ టీడీపీ నాయకులకు రక్షణ కరువైంది: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

by Seetharam |   ( Updated:2023-11-12 07:14:37.0  )
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ టీడీపీ నాయకులకు రక్షణ కరువైంది: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు భద్రత కరువైందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక టీడీపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే హైదరాబాద్‌లో కూడా ప్రతిపక్ష నాయకులకు భద్రత లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న టీడీపీ నేతలపై ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపించారు. విపక్ష నాయకుల అడ్డు తొలగించుకునేందుకు జగన్ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కిలారి రాజేశ్‌ను ఇంటెలిజెన్స్ పోలీసులు వెంటాడటం అందుకు నిదర్శనంగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ కూడా అంత సేఫ్ కాదనేలా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేశారు.కిలారి రాజేశ్‌ను అంతమెుందించేందుకు జగన్ సర్కార్ కుట్రలు పన్నుతుందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

జగన్‌కు ప్రైవేట్ సైన్యంలా పోలీసులు

ఆంధ్రప్రధేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోతుందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన వైసీపీ నాయకత్వం టీడీపీ నాయకుల అడ్డుతొలగించుకుని గెలుపొందాలని కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులనే ప్రతిపక్ష నాయకులపై కుట్రలకు ప్రభుత్వం ప్రయోగిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉంటున్న కిలారి రాజేశ్ వంటి నేతలపై ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘా పెట్టి ఆ వివరాలను సేకరించి వాటిని రౌడీ మూకలకు అందిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉంటున్న టీడీపీ నాయకులు ఎక్కడెక్కడికి వెళుతున్నారో ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘా ఉండి ఫోటోలు తీస్తున్నారని ఆరోపించారు. కిలారీ రాజేశ్‌ను ముగ్గురు అధికారులు ఫాలో అవ్వడం అందుకు నిదర్శనమన్నారు. రాజేశ్‌ను వెంటాడుతున్న ఆ ముగ్గురు వ్యక్తులు అధికారులా లేక రౌడీలా అనేది అనుమానం వ్యక్తం అవుతుందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. హైదరాబాద్‌లోనే కాదు విశాఖ, విజయవాడలలోని ఆయన నివాసాలపై పోలీసులు నిఘా పెట్టారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కాబట్టి రాష్ట్రంలో ఏ ఒక్క టీడీపీ నాయకుడికి ఎలాంటి హాని జరిగినా అందుకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. పోలీసులు కూడా సీఎం జగన్‌కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించకుండా ప్రతిపక్ష నేతలకు రక్షణ కల్పించాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed