YSRCP:PAC చైర్మన్ పదవికి వైసీపీ కీలక నేత నామినేషన్..!

by Jakkula Mamatha |
YSRCP:PAC చైర్మన్ పదవికి వైసీపీ కీలక నేత  నామినేషన్..!
X

దిశ,వెబ్‌డెస్క్: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ క్రమంలో పుంగనూరు(Punganur) ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(MLA Peddireddy Ramachandra Reddy) ఇవాళ(గురువారం) అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ(YCP)కి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. నిజానికి PAC సభ్యుడిగా ఎన్నిక కావడానికి 18 మంది ఎమ్మెల్యే బలం ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రతిపక్ష హోదా ఉంటేనే ఇందుకు అర్హులని టీడీపీ వాదిస్తోంది.

అయితే.. బలం లేకున్నా పీఏసీ చైర్మన్ పదవి(post of PAC Chairman) బరిలోకి వైసీపీ(YSRCP) దిగడంపై ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. PAC లో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 9 మంది శాసనసభ నుంచి, మిగతా ముగ్గురు మండలి నుంచి ఎన్నికవుతారు. అయితే, చైర్మన్‌ను(Chairman) మాత్రం శాసనసభ్యుల(Legislators) నుంచే ఎన్నుకుంటారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ఒక్క సభ్యుడిని ఎన్నుకునేంత బలం ఉండడంతో పయ్యావుల కేశవ్‌కు ఆ అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం నుంచి పీఏసీ చైర్మన్ ఉండాలన్న సంప్రదాయం మేరకు ఆయననే చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం అసెంబ్లీలో మాత్రం ఒక్కరిని ఎన్నుకునేంత బలం కూడా వైసీపీకి లేదు. అయినా వైసీపీ చైర్మన్ బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed