Breaking: కోడి కత్తి దాడి కేసులో కుట్ర కోణం లేదు: NIA

by srinivas |   ( Updated:2023-04-13 10:43:44.0  )
Breaking: కోడి కత్తి దాడి కేసులో కుట్ర కోణం లేదు: NIA
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై కోడి కత్తి దాడి కేసులో ఎన్‌ఐఏ అఫిడవిట్ దాఖలు చేసింది. కోడికత్తి దాడి కేసులో కుట్ర కోణం లేదని పేర్కొంది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు సంబంధం లేదని తెలిపింది. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని వెల్లడించింది. వ్యక్తిగతంగానే జగన్‌పై శ్రీను దాడి చేశాడని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. దాడి కేసులో జగన్ పిటిషన్‌ను కొట్టివేయాలని ఎన్ఐఏ తెలిపింది. తదుపరి వాదనలకు సమయం కావాలని జగన్ తరపు లాయర్లు కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి: వైఎస్ వివేకానందారెడ్డిది హత్యే.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు

Advertisement

Next Story