భగ్గుమన్న టమాటా ధర... విజయవాడ మార్కెట్‌లో కిలో ఎంతంటే..!

by srinivas |   ( Updated:2024-07-14 11:58:32.0  )
భగ్గుమన్న టమాటా ధర... విజయవాడ మార్కెట్‌లో కిలో ఎంతంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకు కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. కొన్ని రోజులుగా రేట్స్ మండిపోతున్నాయి. సామాన్యుడు కూరగాయలు కొనలేక అల్లాడిపోతున్నారు. కిలో కొనాలని మార్కెట్‌కు వెళితే అరకేజీతోనే సరిపెట్టుకుంటున్నారు. టమాటా, బంగాళాదంపలు, ఉల్లిపాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతేడాది ఇదే రోజుల్లో ఉన్న రేట్లకి ప్రస్తుత ధరలకు చాలా వ్యాత్యాసం కనిపిస్తోంది. ఏపీలో అయితే టమాటా ధరలు సాధారణానికి మించి ఉన్నాయి. సరఫరా తగ్గడంతో డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

ప్రధానంగా విజయవాడ మార్కెట్‌లో అయితే టమాటా ధరలు భగ్గుమన్నాయి. రాజీవ్ గాంధీ హోల్ సేట్ మార్కెట్‌ యార్డులో టమాటా ధర శనివారం స్వల్పంగా పెరగగా.. కాలేశ్వరరావు మార్కెట్‌లో మొదటి రకం టమాటా గరిష్టంగా రూ. 64కు అమ్ముతున్నారు. రెండు రోజుల క్రితం టమాటా ధర రూ. 50 ఉండగా.. ఈ నెల 13న రూ. 54కు పెరిగింది. ఈ రోజు రూ. 64 అయింది. ఒక్క రోజు గ్యాప్‌లోనే టమాటా ధర కిలోపై రూ. 10 పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story