రాజులు కూడా ఇలా కట్టుకోరేమో: రుషికొండ భవనాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-11-02 12:03:04.0  )
రాజులు కూడా ఇలా కట్టుకోరేమో: రుషికొండ భవనాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రుషికొండ ప్యాలెస్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రుషికొండ భవనాలు కళ్లు చెదిరేలా ఉన్నాయని తెలిపారు. ఒక వ్యక్తి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసింది ఇక్కడేనని విమర్శించారు. గుండె చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు. రుషికొండ ప్యాలెస్‌కి రూ. రూ. 450 కోట్లు ఖర్చు చేశారని, తొలుత టూరిజం కోసం అన్నారని, ఆ తర్వాత రాష్ట్రపతి, ప్రధాని కోసమని చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని రాష్ట్రపతి ఎప్పుడూ ఇలాంటి ప్యాలెస్‌లు కోరుకోలేదని తెలిపారు. రూ. 36 లక్షలు పెట్టి బాత్ టబ్ చేయించారని చంద్రబాబు తెలిపారు.

‘‘7 బ్లాకులలతో విలావంతమైన భవనాలు కట్టారు. రుషికొండలో 18 ఎకరాల్లో భవనాలు నిర్మించారు. విలాసం కోసం ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఎటు నుంచి చూసినా సముద్రం కనిపించేలా కట్టారు. రాజులు కూడా ఇలాంటివి కట్టుకోలేదేమో. వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్‌లోనూ ఇంత విలాసం లేదు. ఒకప్పుడు రాజులు విలాసవంతమైన భవనాలు కట్టుకునేవాళ్లు. కోర్టులు, కేంద్రాన్ని మభ్య పెట్టి నిర్మాణాలు చేపట్టారు. విచారణ చేపడితే అన్ని బయటకు వస్తాయి. పేదల పేర్లు చెప్పి విలాసవంతమైన భవనాలు కట్టారు. ఈ భవనాలకు పెట్టిన ఖర్చు రూ. 500 కోట్లను రోడ్లకు పెట్టి ఉంటే గుంతలు ఉండేవి కాదు. రుషికొండ భవనాలను వీడియో తీసి ప్రజలకు అందిస్తాం. భవనాల్లోకి వారిని అనుమతిస్తాం. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed