- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ జిల్లాలో డోలీ మోతలకు చెక్.. హోంమంత్రి అనిత కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా ఏజెన్సీ(Visakha District Agency) ప్రాంత ప్రజల కష్టాలను రాష్ట్ర హోంశాఖ గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా హెల్త్ అత్యవసరం(Health Emergency) వస్తే రహదారులు సరిగా లేక అంబులెన్స్(Ambulance) రాని పరిస్థితి ఉంది. దీంతో డోలీనే నమ్ముకుంటున్నారు. కొన్ని సమయాల్లో ప్రమాదం నుంచి బయటపడినా మరికొన్ని సమయాల్లో ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఇలా ఏజెన్సీ ప్రజలు చాలాసార్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కష్టాలు, ఇబ్బందులపై దృష్టి పెట్టిన హోంమంత్రి అనిత(Home Minister Anita) తాజాగా కీలక ప్రకటన చేసింది. విశాఖ జెడ్పీ సర్వసభ్య సమావేశం(Visakha ZP General Assembly)లో పాల్గొన్న హెూంమంత్రి అనిత ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల(Central and State Governments) నిధులతో ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇకపై డోలీ మోతలే ఉండవని స్పష్టం చేశారు. జిల్లాకు రావాల్సిన పెండింగ్ బిల్లుల్ని త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు. గంజాయి పంట సాగు చేయొద్దని, ప్రత్యామ్నాయంగా ఇతర పంటల్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత సమస్యలు, రోడ్ల దుస్థితి, అభివృద్ధిపై కేంద్ర హెూంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఎన్టీయే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.