- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. ఆ రెండు పార్టీలే టార్గెట్‌గా నియామకాలు
దిశ, ఏపీ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇన్చార్జి ఠాగూర్ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ర్ట, జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో సోషల్ మీడియా వింగ్ నియామకాలు చేపట్టింది. కాంగ్రెస్ కమిటీ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మీడియా సమన్వయకర్తగా ఆ పార్టీ రాష్ర్ట కో-ఆర్డినేటర్ బాలు తుమాటిని నియమించింది. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఇన్చార్జి ఠాగూర్ అందజేశారు.
ఈ సందర్భంగా సమన్వయకర్త బాలు తుమాటి మాట్లాడుతూ రాష్ట్ర హక్కులు, హామీలు సాధించడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాత వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి భవిష్యత్ రాజకీయాల గురించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. అప్పుల ఊబితో పాటు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. అప్పుల పాలు చేసిన జగన్ కు రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలు గుణపాఠం చెప్పాలని బాలు పిలుపునిచ్చారు.