ముఖ్య గమనిక: ఓటు వేసి7 సెకన్లు గమనించకపోతే అంతే!

by srinivas |   ( Updated:2024-05-12 12:01:40.0  )
ముఖ్య గమనిక: ఓటు వేసి7 సెకన్లు గమనించకపోతే అంతే!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. దీంతో సొంతూర్లకు ఓటర్లు వెళ్తున్నారు. అయితే కొత్తగా ఓటు వేసే వాళ్లకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ‘ఈవీఎంలో బటన్ నొక్కగానే ఓటు పటినట్టేనా.. ఇంకా ఏమైనా చేయాలా అనే అనుమానాలు ఉంటాయి. సరిగా వేశామా లేదా.. నా ఓటు పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే ప్రశ్నలు వేసుకుంటుంటారు. ఎన్నికల అధికారులు, స్థానిక నాయకులు అవగాహన కల్పించినప్పటికీ అనుమానాలు మాత్రం కొత్త ఓటర్లలో కలుగుతున్నాయి. అలాంటి వారికి అవగాహన కల్పిస్తూ...

  • ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఓటర్ స్లిప్పుతో పాటు కచ్చితంగా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
  • ఓటర్ ఐడీ, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జాబ్ కార్డు, ఉపాధి హామీ కార్డు, పాస్ పోర్ట్, బ్యాంకు, పోస్టాఫీసు బుక్, యుడీఐడీ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లాలి.
  • పోలింగ్ బూత్‌లోకి వెళ్లగానే పోలింగ్ సిబ్బందికి ఓటర్ స్లిప్పు చూపించాలి. వాళ్లు తరవుగా చెక్ చేసి ఓటరు వీరే అని నిర్ధారణకు వస్తారు. ఆ తర్వాత ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తారు. ఆ తర్వాత 17ఏ ఫారంలో నమోదు చేస్తారు. వేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. ఎలక్టోరల్ రోల్ కాపీలో గుర్తు పెట్టి ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌కు వెళ్లమని చెబుతారు. ఓ చిన్నగదిలో ఈవీఎం మెషిన్, దాని పక్కన వీవీపాడ్ యంత్రం (ఎవరికి ఓటు వేశారో కాగితంపై చూపిస్తుంది) ఉంటుంది.
  • ఇక ఈవీఎంపై ఓవైపు అభ్యర్థుల పేర్లు, మరోవైపు వారి గుర్తులు ఉంటాయి. వాటి పక్కనే నీలి రంగు బటన్స్ ఉంటాయి. ఈ నీలి రంగు బటన్‌పై నొక్కితే మీ ఓటు నమోదు అయినట్టు.
  • బటన్ నొక్కిన తర్వాత 5 సెకన్ల పాటు చిన్న శబ్ధం వినిపిస్తుంది. వెంటనే వీవీప్యాట్‌పై పచ్చని లైట్ వెలుగుతుంది. వీవీప్యాడ్‌పై చూస్తే మీరు ఓటేసిన అభ్యర్థి గుర్తు, ఈవీఎంపై అతనికి కేటాయించిన నెంబర్, పేరు ముద్రించిన కాగితపు స్లిప్ ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. ఈ ఏడు సెకన్ల తర్వాత స్లిప్ బాక్సులో పడుతుంది. దీంతో ఓటు హక్కు వినియోగం పూర్తి అవుతుంది.
  • ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రెండు ఈవీఎంలు, రెండు వీవీ‌ప్యాట్లు ఉంటాయి. రెంటిండిపైనా ఓటు వేయాలి. ఏ ఒక్కటి మిస్ అయినా ఆ అభ్యర్థికి ఓటు పోయినట్లే.
Advertisement

Next Story