- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలు మీకు సిగ్గుందా..? వామ్మో కాంగ్రెస్ చీఫ్ తో కబడ్డీ ఆడుకున్నారుగా
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీ ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. రానున్న ఎన్నికల్లో విజయభేరిని మోగించి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలనే ఎజెండాతో అడుగులేస్తున్నారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలో అటు ప్రచారం లోనే కాదు ఇటు సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటున్నారు. తాను పాల్గొన్న సమావేశాల గురించి.. అలానే ఆ సమావేశంలో ఆమె చర్చించిన అంశం పై ప్రతి రోజు X లో పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా నిన్న అనకాపల్లిలో ఆమె పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురించి X వేదికగా ముచ్చటిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో అనకాపల్లి లో నిరవహించిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం లో తాను పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. అలానే ప్రస్తుతం ఉన్నది కచ్చితంగా YSR ప్రభుత్వం కాదని.. YSR ఆశయాలు ఇలా ఉండవని తెలిపారు.. YSR ఆశయాల సాధన కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు.
ఇక మరో 70 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని.. ఈ నేపధ్యంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ వెళ్లి ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తారని పోస్ట్ లో రాసుకొచ్చారు. కాగా ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ వైఎస్ షర్మిల పై విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలి పై కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు. పుట్టింటి పరువు తియ్యడానికి వచ్చింది మహానటి.. రాష్ట్రాలు తిరిగే వలస ఆడ పక్షి అని ఒకరు కామెంట్ పెడితే మరొకరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ప్రధాని కాలేడు దేశం మొత్తం గెలవాలి వెళ్లి నార్త్ లో కూడా ప్రచారం చెయ్యండి అని మరొకరు కామెంట్ పెట్టారు. వైఎస్ షర్మిల పోస్ట్ పై స్పందించిన ఇంకొకరు అసలు మీకు సిగ్గుందా..? అని కామెంట్ చేశారు.