- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం వైఎస్ జగన్‌తో నాయి బ్రహ్మణులు భేటీ
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో నాయి బ్రహ్మణులు మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ వద్ద నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య, డైరెక్టర్‌లు, నాయి బ్రాహ్మణ (కేశ ఖండనశాల) జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, జేఏసీ సభ్యులు కలిశారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
దీంతోపాటు కేశ ఖండనశాలల్లో విధులు నిర్వహించే నాయి బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ. 20,000 ఆదాయాన్ని వర్తింపజేస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులపై ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన కులాలు సమాజానికి వెన్నెముకలని నిరూపిస్తూ సీఎం వైఎస్ జగన్ తమ సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నారని తెలిపారు. త్వరలో నాయి బ్రాహ్మణ కృతజ్ఞతా సభ నిర్వహించనున్నట్లు నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదాయ్య..డైరెక్టర్‌లు, ఇతర జేఏసీ నేతలు వెల్లడించారు.