యువత భవిత చిదిమేస్తున్న జగన్ డ్రగ్ మాఫియా:ఉగ్ర నరసింహారెడ్డి

by Jakkula Mamatha |   ( Updated:2024-03-22 15:19:06.0  )
యువత భవిత చిదిమేస్తున్న జగన్ డ్రగ్ మాఫియా:ఉగ్ర నరసింహారెడ్డి
X

దిశ,కనిగిరి:రాష్ట్రంలో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కనిగిరి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుడు కూనం పూర్ణచంద్రరావు కుటుంబం మొత్తం వైసీపీకి వ్యవస్థాపక సభ్యులని, టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా ఉన్న ఏపీని జగన్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ రవాణాలో నెంబర్ వన్ స్థానానికి చేర్చారన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు ఏపీలోనే దొరుకుతున్నాయని, బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేస్తున్నారని తెలిసి జగన్ రెడ్డి తన అధికారులను పంపారా అని ప్రశ్నించారు.

కల్తీ మద్యం మాఫియాతో ఇన్నాళ్లు ప్రజల ఇల్లు, ఒళ్ళు, ప్రాణాలు బలి చేశారు. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్గా మారుస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో డ్రగ్స్ మాఫియా కు చెందిన కూనం వీరభద్రరావు కరోనా సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. రాజధాని లేక, అభివృద్ధి జరగక, నిత్యావసర వస్తువుల పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తి పోయారని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు.

Read More..

వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై.. ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు

Advertisement

Next Story