విశాఖ ఆర్థిక వ్యవస్థకు మూలం సముద్రం.. నిర్లక్ష్యం చేయడం బాధాకరం..

by Indraja |
విశాఖ ఆర్థిక వ్యవస్థకు మూలం సముద్రం.. నిర్లక్ష్యం చేయడం బాధాకరం..
X

దిశ వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం లోని సముద్రం పైన సపందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం అంటేనే ముందుగా గుర్తుకువచ్చేది సముద్రం అని పేర్కొన్న ఆయన .. విశాఖపట్నం ఆర్ధిక వ్యస్థకు మూలాధారం సముద్రమని తెలిపారు. అలాంటి సముద్రతీరాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం నిజంగా చాలా బాధాకరం అని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఇక నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్ధాలు డ్రైనేజీ ద్వారా సరాసరి వచ్చి సముద్రంలో కలుస్తున్నాయని.. ఈ నేపధ్యంలో సముద్రతీరాలు పూర్తిగా వ్యర్ధాలతో నిండి పోయి ఆ ప్రాంతమంతా కలుషితంగా మారుతుంది ఆందోళన వ్యక్తం చేశారు.

దీనితో పెరిగిన కాలుష్యం కారణంగా గత 30 సంవత్సరాల వ్యవధిలో 3.4 కిలోమీటర్ల సముద్ర తీరం కుదించుకుపోయిందని.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇలా జరిగిందని మండిపడ్డారు. ఇక దాదాపు రెండు లక్షల మంది మత్స్యకారులు విశాఖ లోని సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని.. అలాంటి సముద్ర తీరాన్ని నిర్లక్ష్యం చేయడమంటే ఆ విశాఖ సముద్ర తీరాలపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేసినట్లే అని పేర్కొన్నారు. ఇక తక్షణమే వ్యర్ధాలు సముద్రంలో కలవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అసలు మనసు పెడితే విశాఖలో పర్యాటక రంగాన్ని 10 రెట్లు అభివృద్ధి చెయ్యవచ్చని తెలిపిన ఆయన.. ఈ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి రాకపోవడం నిజంగా ఆశ్చర్యం అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story