550 ఏళ్ల కల అయోధ్య రామాలయం.. అది చరిత్రలో నిలిచిపోయే రోజు..నరసింహారావు

by Indraja |   ( Updated:2024-01-19 12:21:45.0  )
550 ఏళ్ల కల అయోధ్య రామాలయం.. అది చరిత్రలో నిలిచిపోయే రోజు..నరసింహారావు
X

దిశ వెబ్ డెస్క్: శ్రీ రాముని జన్మ స్థలమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి అయింది. ఈ నేపథ్యంలో జనవరి 22 వ తేదీన శ్రీ రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాస్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్నది 550 ఏళ్ల కలని.. అది ఇన్నాళ్లకు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఇక జనవరి 22 వ తేదీ భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. భారత దేశంలో హిందువులు కన్న కల ఈ నాటికి నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో హిందువుల కలలను అధికారాలను అణిచివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పార్టీలు చేసిన తప్పిదాల కారణంగా హిందువులు ఇబ్బందులను ఎదుర్కొన్నారని.. ఆ పార్టీలు హిందువులను నట్టేట ముంచాయని మండిపడ్డారు. ఇక దేశవ్యాప్తంగా అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్టను స్వాగతిస్తుంటే.. రాముడు ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బాయికాట్‌ చేయడం దారుణం అన్నారు. కాంగ్రెస్ దేవుని కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని.. ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More..

Thirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

Advertisement

Next Story

Most Viewed