ఎన్నికల్లో పోటీపై ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
ragurama news
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఎన్నికల్లో కచ్చితంగా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి ఆయన ఎంపీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఆయనకు నిరాశ కలిగింది. దీంతో ఆయన మనస్థాపం చెందినట్లు ప్రచారం జరిగింది. అయితే నర్సాపురం పార్లమెంటుకు పోటీలో ఉంటానని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదమిరంలోని తన నివాసానికి వెళ్లిన రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తనకు కచ్చితంగా ఎన్డీఏ కూటమి తరపున న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. రెండు మూడు రోజుల్లోగా ఎన్డీఏ కూటమి నుండి నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. అసెంబ్లీ బరిలో మాత్రం తాను ఉండనని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి‌పై తాను వేసిన కేసులు ఏప్రిల్ ఒకటో తేదీన ట్రయల్‌కు వస్తాయన్నారు. ఇప్పటికే మూడు వేల సార్లు జగన్మోహన్ రెడ్డి వాయిదాలు కోరారని గుర్తు చేశారు. కోర్టు కూడా అన్ని సార్లు నిబంధనల మేరకు వాయిదాలు ఇవ్వకూడదని రఘురామకృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed