- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీని ఎలా తొక్కుకుంటూ వెళ్లాలో చెప్పిన నారా లోకేష్ .. ట్వీట్ వైరల్..
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీకి ప్రతిపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నేతలు పంచ్ డైలాగ్ లతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. అటు భహిరంగ సభల్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ డైలాగ్ ల పరంపరను కొనసాగిస్తున్నారు.
తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీని ఎలా తొక్కుకుంటూ వెళ్లాలో ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించారు. సైకిల్ మీద కమలం పెట్టుకుని, జనసేన గ్లాస్ చేతపట్టుకుని, ఎదురొచ్చిన వైసీపీని తొక్కుకుంటూ వెళ్దాం.. కూటమి జెండా ఎగుర వేద్దాం అనే ట్యాగ్ తో ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా నారా లోకేష్ పోస్ట్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.